తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లయన్'​ బాలయ్యతో 'లైగర్'​.. సంక్రాంతికి గర్జన - 7 డేస్ 6 నైట్స్

Unstoppable with NBK: బాలయ్యతో కలిసి 'అన్​స్టాపబుల్'​ షోలో సందడి చేశారు హీరో విజయ్ దేవరకొండ. దాంతో పాటు సుమంత్ అశ్విన్, సముద్రఖని కొత్త సినిమాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

vijay devarakonda
విజయ దేవరకొండ

By

Published : Jan 8, 2022, 8:40 PM IST

Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణతో సందడి చేయనున్నారు రౌడీ హీరో విజయ దేవరకొండ. బాలయ్య వ్యాఖ్యతగా చేస్తోన్న 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' షోకు ఆయన అతిథిగా వచ్చారు. విజయ్​తో పాటు 'లైగర్' దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి బాలయ్య షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సంక్రాంతి కానుకగా జనవరి 14న ఓటీటీ ఆహాలో ప్రసారంకానుంది.

బాలయ్యతో 'లైగర్' టీమ్

సుమంత్ అశ్విన్ సినిమా వాయిదా..

ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ నటించిన చిత్రం '7 డేస్ 6 నైట్స్'. సినిమాను ఈ సంక్రాంతికే రిలీజ్​ చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించింది చిత్రబృందం. కొత్త రిలీజ్​ డేట్​ను త్వరలో వెల్లడిస్తామని చెప్పింది. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోహన్, కృతిక.. ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

'7 డేస్ 6 నైట్స్' వాయిదా

పబ్లిక్​లో సముద్రఖని..

'పబ్లిక్​' టైటిల్ పోస్టర్

ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆ సినిమా టైటిల్​, ఫస్ట్​లుక్​ పోస్టర్​ను స్టార్​ హీరో విజయ్ సేతుపతి శనివారం విడుదలచేశారు. ఈ సినిమాకు 'సముద్రఖని ఇన్ పబ్లిక్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్​లుక్​ పోస్టర్​ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాకు రా పరమాన్ దర్శకుడు. కేకే రమేశ్ నిర్మిస్తున్నారు.

'పబ్లిక్​' ఫస్ట్​ లుక్

ఇదీ చూడండి:'శ్యామ్‌ సింగరాయ్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్‌.. 'బంగార్రాజు' హంగామా

ABOUT THE AUTHOR

...view details