దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'బాలాకోట్ దాడి' కథాంశంతో బాలీవుడ్లో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఇటీవల ప్రకటించాడు. 'కేదార్‌నాథ్' దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు.
తాజాగా ఇందులో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు టాక్. ఇప్పటికే దీనిపై రౌడీ హీరోతో చిత్రబృందం చర్చలు జరపగా.. విజయ్ సుముఖత చూపినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.