విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమా విడుదలై ఇప్పటికే ఏడాది దాటిపోయింది. అప్పుడు ప్రేక్షకాదరణ దక్కించుకోవడంలో విఫలమైనా సరే ఇప్పుడు మాత్రం యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు ఏకంగా రెండు మిలియన్లకు పైగా లైకులు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక నటన చాలా బాగుందని ఉత్తరాది వీక్షకులు తెగ కామెంట్స్ పెడుతున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ తీస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఫైటర్'లో ప్రస్తుతం నటిస్తున్నారు విజయ్. ఈ చిత్రంతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టబోతున్నారు.