యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాడు. 'దొరసాని' అనే చిత్రంతో హీరోగా పరిచయం కానున్నాడు ఆనంద్. ఈ సినిమాను జూలై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. తెలంగాణ నేపథ్యంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. ఈ చిత్రంతోనే అతడు దర్శకుడిగా మారుతున్నాడు. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్గా నటిస్తోంది. సురేష్ బాబు సమర్పణలో 'పెళ్లి చూపులు' సహ నిర్మాతలు యష్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'దొరసాని' ప్రేమలో దేవరకొండ బ్రదర్.. - రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక
వరుస హిట్లతో దూసుకెళ్తూ హీరో విజయ్ దేవరకొండ వెండితెరపై రాణిస్తుంటే...అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ సరికొత్తగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
దొరసాని ప్రేమలో దేవరకొండ బ్రదర్..
సినిమా విడుదల దగ్గరపడటంతో ప్రచార కార్యక్రమాలు వినూత్నంగా చేయాలని చిత్రనిర్మాతలు భావిస్తున్నారట. విజయ్ దేవరకొండ, రాజశేఖర్ ఈ సినిమా ప్రమోషన్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.