తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నల్లమల: కేటీఆర్​కు డియర్​ కామ్రేడ్​ మరో ట్వీట్​ - vijay devarakonda another tweet to ktr

తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్​కు మరోసారి ట్వీట్​ చేశాడు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ. నల్లమల సంరక్షణ కోసం ప్రభుత్వం ఆదేశాలిచ్చేవరకు ప్రయత్నం ఆపమని అన్నాడు. అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపడానికి వ్యతిరేకంగా ఈ యువ కథానాయకుడు గళమెత్తుతున్నాడు.

నల్లమల: కేటీఆర్​కు డియర్​ కామ్రేడ్​ మరో ట్వీట్​

By

Published : Sep 15, 2019, 10:02 AM IST

Updated : Sep 30, 2019, 4:14 PM IST

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపడానికి వ్యతిరేకంగా యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ గళమెత్తుతున్నాడు. 'యురేనియం కొనొచ్చు కాని అడవులను కొనగలమా?' అని ఈ హీరో చేసిన ట్వీట్లు నెట్టింట బాగా చర్చనీయాంశమయ్యాయి. మంత్రి కేటీఆర్​ స్పందనతో... తాజాగా విజయ్​ మరో ట్వీట్​ చేశాడు.

కేటీఆర్​, విజయ్​

" ఇది మొదటి విజయం. మనమంతా కలిసి మన అభిప్రాయాల్ని వినిపించాం. తగిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇది పూర్తయ్యే వరకు మన ప్రయత్నం ఆపొద్దు. అమ్రాబాద్ ప్రజలకు, నల్లమలకు నా మద్దతుతో పాటు అనేక మంది సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది."
-- విజయ్​ దేవరకొండ, సినీ నటుడు

విజయ్​ మొదటి మాట​

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టొద్దని సామాజిక మాధ్యమాల్లో ట్వీట్​ చేశాడు విజయ్ ​దేవరకొండ. "యురేనియం కొనొచ్చు, అడవులను కొనగలమా" అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ డియర్​ కామ్రేడ్​తో పాటు శేఖర్ కమ్ముల, అనసూయ తదితరులు నల్లమలను కాపాడదామని పోస్టులు పెట్టారు.

ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్.... నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై అందరి అభిప్రాయాల్ని విన్నానని ట్వీట్​ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్​తో వ్యక్తిగతంగా చర్చిస్తానని చెప్పారు.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details