తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇలాంటి సినిమా కోసమే చాలా రోజులుగా ఎదురుచుశా : విజయ్​ - vijadevarakonda about pokiri movie

పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో తాను నటిస్తోన్న 'ఫైటర్'​ సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు హీరో విజయ్​ దేవరకొండ. లాక్​డౌన్​లో ఫిట్​నెస్​పై పూర్తిగా దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.

vijay devarakonda
విజయ్​

By

Published : Oct 11, 2020, 10:14 AM IST

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తీసిిన సినిమాల్లో 'పోకిరి' అంటే చాలా ఇష్టమని యువహీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్'‌ తర్వాత ఇతడు నటిస్తున్న సినిమా ఫైటర్‌(వర్కింగ్‌ టైటిల్‌). పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పూరీ దర్శకుడు. బాలీవుడ్‌ నటి అనన్యా పాండే కథానాయిక. ఈ సినిమా గురించి విజయ్ ఇటీవలే‌ ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించారు. గత చిత్రాలతో పోలిస్తే ఫైటర్‌, నటుడిగా తనకు కొత్త అనుభవాన్ని ఇస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మానసికంగానే కాకుండా శారీరకంగా కష్టపడుతున్నట్లు చెప్పారు.

"సిక్స్‌ప్యాక్‌, 8 ప్యాక్‌ అనేది ముఖ్యం కాదు.. నేను ఎదుటి వ్యక్తిని బీట్‌ చేసేలా ఓ ఫైటర్‌లా కనిపించాలి. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు నేను తప్పక కృషి చేయాలి. లాక్‌డౌన్‌ కాలంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. గత ఎనిమిది నెలలుగా విరామం లేకుండా శ్రమిస్తున్నా. ఈ క్రమంలో పరిస్థితుల నేపథ్యంలో కాస్త నిరాశ చెందినప్పటికీ.. వర్కౌట్‌ను మాత్రం ఆపలేదు. ఇది కేవలం ఓ కమర్షియల్‌ సినిమా మాత్రమే కాదు. కథ విన్న తర్వాత వెంటనే నటించేందుకు ఒప్పుకున్నా. ఇలాంటి చిత్రం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాలో కేవలం నా ఫిజిక్‌ మాత్రమే కాదు.. ఎనర్జీ, వాయిస్‌ పిచ్‌ అన్నీ విభిన్నంగా ఉంటాయి. నాకిష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన తీసిన చిత్రాల్లో పోకిరి అంటే బాగా ఇష్టం" అని విజయ్‌ చెప్పారు.

లాక్‌డౌన్‌కు ముందు ఫైటర్‌కు సంబంధించిన షూటింగ్‌ కొంత భాగం ముంబయిలో జరిగింది. కరోనా కారణంగా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. నవంబరులో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారని సమాచారం. రమ్యకృష్ణ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం విజయ్‌ తన యూరప్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇదీ చూడండి క్రేజీ హీరోలు... క్లాస్ విలన్లయ్యారు!

ABOUT THE AUTHOR

...view details