విజయ్ దేవరకొండ సినిమాలకు యూత్‌లో రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతోంది. 'అర్జున్‌రెడ్డి'తో సంచలనం సృష్టించిన ఈ యువ హీరో... మరో ప్రేమ కథతో 'డియర్ కామ్రేడ్'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'గీత గోవిందం' హీరోయిన్ రష్మిక మందణ్నతో రెండోసారి జతకట్టాడీ రౌడీహీరో. భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా... జులై 26న తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
కరణ్ జోహార్‌ను ప్రేమలో పడేసిన 'డియర్' - vijay devara konda
విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్న జంటగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ దర్శకుడు. జులై 26న దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది.
వినూత్న కార్యక్రమాలతో ఇప్పటికే ప్రచార జోరు పెంచిన చిత్రబృందం... అన్ని సినీ పరిశ్రమల అభిమానులకు దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ముంబయి వెళ్లింది. అక్కడ కరణ్ జోహార్‌తో మాట్లాడిన విజయ్... ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. 'డియర్ కామ్రేడ్' సినిమా హిందీలోనూ రీమేక్ చేసేందుకు అతడు ఒప్పుకున్నట్లు ప్రకటించాడు. ధర్మమూవీస్ పతాకంపై తెరకెక్కించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించాడు కరణ్. ఫలితంగా అర్జున్ రెడ్డి తర్వాత బాలీవుడ్లో రీమేక్ అవుతున్న విజయ్ రెండో సినిమాగా పేరు తెచ్చుకుంది.
ఇది చదవండి: కియరా అడ్వాణీకి ఆ పేరెలా వచ్చిందంటే..!