తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సంపాదనలో 70 శాతం ఈ సినిమాకే ఖర్చు పెట్టా'

'మీకు మాత్రమే చెప్తా' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన హీరో విజయ్ దేవరకొండ.. తను నిర్మాణ రంగలోకి ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పాడు. వీటితో పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు.

హీరో-నిర్మాత విజయ్ దేవరకొండ

By

Published : Oct 31, 2019, 3:19 PM IST

టాలీవుడ్​ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. ఓ వైపు సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ మారాడు. కింగ్​ ఆఫ్ హిల్​ పతాకంపై 'మీకు మాత్రమే చెప్తా' నిర్మించాడు. దర్శకుడు తరుణ్​ భాస్కర్​..తొలిసారి హీరోగా నటించాడు. శుక్రవారం ఈ చిత్రం విడుదల సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు విజయ్. తను నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పాడు.

హీరో-నిర్మాత విజయ్ దేవరకొండ

"ఇప్పుడిలా ఉన్నానంటే కారణం వాళ్లే. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొంత మంది నాకు సహాయం చేశారు. అందుకే ఇప్పుడు యువ ప్రతిభావంతులకు సపోర్ట్​ చేసేందుకు సిద్ధమవుతున్నా. అందులో భాగంగానే నిర్మాతగా మారాను. నా సంపాదనంలో దాదాపు 70 శాతం ఖర్చు చేసి ఈ సినిమా తీశాను. 'ఎవడే సుబ్రహ్మణ్యం' నుంచి సంపాదించింది అంతా ఇందులో పెట్టా. ఏదైనా రిస్క్ తీసుకున్నప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలం. ఈ చిత్రం ఆడియో, డిజిటల్​ హక్కులు అమ్ముడైనప్పుడే, మరిన్ని సినిమాలు తీయగలననే నమ్మకం వచ్చింది. 'మీకు మాత్రమే చెప్తా' కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది" -విజయ్ దేవరకొండ, హీరో

ఈ సినిమాలో అభినవ్ గోమటం, అనసూయ కీలక పాత్రలు పోషించారు. పావని గంగిరెడ్డి, వాణి భోజన్ హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. శివకుమార్ సంగీతమందించాడు. షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించాడు. వర్ధన్ దేవరకొండతో కలిసి విజయ్ నిర్మాతగా వ్యవహరించాడు.

ఇది చదవండి: 'టైటానిక్' గురించి ఈ విశేషాలు మీకు తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details