'సైరా', 'సాహో'లాంటి తెలుగు సినిమాలు.. ఇంగ్లీష్‌లో డబ్ కావాలని అన్నాడు హీరో విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన టెర్మినేటర్: డార్క్ ఫేట్ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడీ కథానాయకుడు.
'మన సినిమాలూ హాలీవుడ్‌లో డబ్ కావాలి' - terminator dark fate cinema telugu trailer
టాలీవుడ్లో తీసే భారీ చిత్రాలను హాలీవుడ్‌లోనూ డబ్బింగ్ చేయాలని అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. 'టెర్మినేటర్:డార్క్ ఫేట్' సినిమా తెలుగు ట్రైలర్‌ను బుధవారం ఆవిష్కరించాడీ నటుడు.
"డిస్నీ సంస్థ.. హాలీవుడ్‌లో తాము నిర్మించిన చిత్రాల్ని తెలుగు భాషలో విడుదల చేస్తోంది. అదేవిధంగా మేం తీసిన ‘సాహో’, ‘సైరా’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’లాంటి సినిమాల్ని కూడా హాలీవుడ్‌కు తీసుకెళ్లాలి. నేను ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తోపాటు తెలుగులోనూ చూస్తాను. సరైన స్క్రిప్టు వస్తే బాలీవుడ్‌లో కూడా నటిస్తాను" -విజయ్ దేవరకొండ, హీరో
టెర్మినేటర్ సిరీస్‌లో ఇది ఐదో చిత్రం.ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్ ప్రధాన పాత్ర పోషించాడు. టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్ కేమరూన్ నిర్మించాడు. 1991లో వచ్చిన ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. వచ్చే నెల 1న తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.