కోలీవుడ్ నటుడు విజయ్ ప్రస్తుతం లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో 'మాస్టర్' సినిమాలో నటిస్తున్నాడు. తర్వాతి చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థలో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకుగాను నిర్మాణ సంస్థ విజయ్‌కు రూ.100 కోట్లు పారితోషికం చెల్లించనున్నట్లు తెలుస్తోంది.
విజయ్ తన 65వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థలో చేయనున్నాడట. ఈ సినిమా కోసం విజయ్ రూ.100 కోట్లు పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఇప్పటికే అడ్వాన్స్ కింద రూ.50 కోట్లు చెల్లించారని కోలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. 'అసురన్' చిత్రంతో విజయం సాధించిన వెట్రిమారన్‌తో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం.