కరోనా మహామ్మారిలోనూ ఘన విజయాలను అందుకున్న 'క్రాక్', 'ఉప్పెన', 'జాతిరత్నాల' జాబితాలో తన సినిమా విజయ రాఘవన్ కూడా ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని ధీమా వ్యక్తం చేశారు.
నా సినిమా ఆ జాబితాలో చేరుతుంది: విజయ్ - విజయ్ ఆంటోని విజయ్ రాఘవన్
తాను నటించిన 'విజయ రాఘవన్' సినిమాను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని. ఈ చిత్రంలోని ఓ పాటను ఆయన ప్రత్యేకంగా విడుదల చేశారు. భారతీయ సినిమా ప్రగతిని తెలుగు సినీ ప్రేక్షకులు ఉన్నత స్థాయికి చేర్చారని అన్నారు.
భారతీయ సినిమా ప్రగతిని తెలుగు సినీ ప్రేక్షకులు ఉన్నత స్థాయికి చేర్చారని పేర్కొన్న విజయ్.. 'నకిలీ', 'డాక్టర్ సలీమ్', 'బిచ్చగాడు', 'బేతాళుడు', 'కిల్లర్' లాంటి చిత్రాలను ఎంతో ఆదరించారని గుర్తుచేసుకున్నారు. అదే తరహాలో తన తాజా చిత్రం విజయ రాఘవన్ ను ఈ వేసవిలోనే విడుదల చేస్తున్నట్లు విజయ్ ఆంటోని ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో విజయ రాఘవన్ లోని 'తను చూసి నవ్వుకున్న' పాటను ప్రత్యేకంగా విడుదల చేశారు. విజయ్ ఆంటోని సరసన ఆత్మీక కథానాయికగా నటించగా... ఆనంద కృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇదీ చూడండి: 'విజయ రాఘవన్' టీజర్.. 'మరక్కార్' రిలీజ్ డేట్ ఫిక్స్