తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జ్వాల'గా రానున్న 'బిచ్చగాడు' హీరో - vijay antony jwala first look

విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రం 'అగ్ని సిరగుల్'. ఈ సినిమాను తెలుగులో 'జ్వాల'గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

జ్వాల

By

Published : Nov 21, 2019, 1:22 PM IST

విజయ్‌ ఆంటోని అంటే తెలుగు ప్రేక్షకులకు తొందరగా అర్థం కాదు. కానీ 'బిచ్చగాడు' హీరో విజయ్‌ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పేరుకు తమిళ నటుడే అయినా అక్కడ నటించే అతని సినిమాలన్నీ తెలుగులో అనువాదమై అలరిస్తుంటాయి. అలా వచ్చిన వాటిల్లో భేతాళుడు, రోషగాడు, కాశిలాంటి చిత్రాలు ఉన్నాయి. అలా ప్రస్తుతం తమిళంలో 'అగ్ని సిరగుల్‌' అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్పుడే ఇదే సినిమాని తెలుగులో 'జ్వాల'గా తీసుకురానున్నారు.

జ్వాల

ఈ సినిమాకు 'జ్వాల' అనే పేరును ఖరారు చేస్తూ తెలుగులో ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నవీన్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో కమల్‌హాసన్‌ రెండో కూతురు అక్షర హాసన్‌ కథానాయికగా నటిస్తోంది. చిత్రంలో విజయ్‌.. శీను అనే పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను విదేశాలైన మాస్కో, రష్యా, కజకిస్థాన్‌లాంటి ప్రాంతాల్లో తెరకెక్కించారట. యాక్షన్‌ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్, జవ్వాజి రామాంజనేయులు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ఇవీ చూడండి.. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం నాన్నా.. ఐశ్వర్య భావోద్వేగం

ABOUT THE AUTHOR

...view details