తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బిచ్చగాడు' సీక్వెల్​కు కథ సిద్ధం చేసిన విజయ్​ - Bichagadu Sequel news

'బిచ్చగాడు' సినిమాతో తమిళం, తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విజయ్​ ఆంటోని. ప్రస్తుతం అదే చిత్రానికి సీక్వెల్​ నిర్మించే క్రమంలో రచయితగానూ మారి.. స్క్రిప్ట్​ వర్క్​ చేస్తున్నారు విజయ్​.

Vijay Antony became the storywriter for the Bichagaadu sequel
త్వరలో 'బిచ్చగాడు' సీక్వెల్​.. రచయితగా విజయ్​

By

Published : May 27, 2020, 10:16 AM IST

తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన 'బిచ్చగాడు'.. నటుడు విజయ్ ఆంటోనికి గుర్తింపు తీసుకొచ్చింది. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చి, ఘనమైన వసూళ్లు సాధించిందీ చిత్రం. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్‌ తీయనున్నారు. అందుకోసం నటుడు విజయ్‌నే రచయితగా మారారు. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"నాలుగు నెలల నుంచి సీక్వెల్‌ కోసం స్క్రిప్ట్​ సిద్ధం చేసే పనిలో ఉన్నాను. స్క్రిప్ట్​కు తుదిమెరుగులు దిద్దుతున్నాం. త్వరలోనే తారాగణంతో పాటు సాంకేతివర్గాన్ని వెల్లడిస్తా"

- విజయ్​ ఆంటోని, తమిళ కథానాయకుడు

మాతృకకు దర్శకత్వం వహించిన శశి.. ప్రస్తుతం వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీనితో పాటే సీక్వెల్​కూ విజయ్ ఆంటోనినే సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇతడు ప్రస్తుతం 'తమీజరాసన్‌', 'అగ్ని సిరగుగాల్‌', 'ఖాకీ' చిత్రాలతో పాటు మరో మూడు సినిమాల్లోను నటిస్తున్నాడు.

ఇదీ చూడండి... టాలీవుడ్ దర్శకులకు ఇదో మంచి కథావకాశం

ABOUT THE AUTHOR

...view details