తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బెస్ట్​ ఫ్రెండ్ సీక్రెట్ చెప్పనున్న​ విజయ్​ దేవరకొండ! - tarun bhaskar

విజయ్ దేవరకొండ నిర్మాణంలో దర్శకుడు తరుణ్​భాస్కర్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. తాజాగా ఈ సినిమా తొలిరూపు విడుదలైంది.

మీకు మాత్రమే చెప్తా

By

Published : Aug 29, 2019, 9:23 PM IST

Updated : Sep 28, 2019, 7:15 PM IST

'పెళ్లిచూపులు' తర్వాత తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ కాంబినేషన్​లో మరో చిత్రం రాబోతుంది. కాకపోతే ఇక్కడ తరుణ్ హీరో, విజయ్ నిర్మాత. 'మీకు మాత్రమే చెప్తా' పేరుతో రానున్న ఈ చిత్రం ఫస్ట్​లుక్ విడుదలైంది. బుధవారం సినిమాను ఖరారు చేసి.. గురువారం తొలిరూపు విడుదల చేయడం విశేషం.

మీకు మాత్రమే చెప్తా ఫస్ట్​లుక్​

'మీకు మాత్రమే చెప్తా: మై బెస్ట్ ఫ్రెండ్స్​ సీక్రెట్' అనే సబ్​టైటిల్​తో ఫస్ట్​లుక్​ ఆకర్షిస్తోంది. షమీర్ సుల్తాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

తరుణ్ - విజయ్ కాంబినేషన్​లో వచ్చిన 'పెళ్లి చూపులు' సినిమా ఘనవిజయం అందుకుంది. మళ్లీ ఈ సినిమాతో వీరిద్దరూ కలిసి పనిచేయడం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. తరుణ్ భాస్కర్ దర్శకుడిగానే కాకుండా మహానటి, ఫలక్​నూమాదాస్ చిత్రాల్లో నటించి నటుడిగానూ మెరిశాడు.

ఇది చదవండి: ట్రైలర్​: తప్పొప్పులను నిర్ణయించేది ఎవరు..!

Last Updated : Sep 28, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details