తమిళ అగ్రహీరో విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'మాస్టర్'. ఇది తన కెరీర్ 64వ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మరో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. లోకేశ్ కనకరాజు దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ తర్వాతి చిత్రం విషయంలో కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నెట్టింట్లో ఆ హ్యాష్‌ట్యాగ్ హల్చల్.. నాలుగోసారీ కుదిరేనా? - విజయ్ మురుగదాస్
ప్రముఖ నటుడు విజయ్ 'మాస్టర్' చిత్రం విడుదల కాకుండానే తర్వాత సినిమా విషయంలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ కోలీవుడ్ స్టార్ తన తర్వాతి చిత్రం కోసం మరోసారి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో పని చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
![నెట్టింట్లో ఆ హ్యాష్‌ట్యాగ్ హల్చల్.. నాలుగోసారీ కుదిరేనా? Vijay and AR Murugadoss may reunite for Thalapathy 65 Project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6470701-1043-6470701-1584627475718.jpg)
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన తర్వాతి చిత్రాన్ని ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో చేయనున్నాడని సమాచారం. అంతేకాకుండా 'తుపాకీ' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రానుందని పలు వెబ్‌సైట్లలో వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విజయ్-మురుగదాస్ కాంబో గురించి వస్తోన్న వార్తలపై సంతోషం వ్యక్తం చేసిన నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా పలు పోస్టులు పెడుతున్నారు. ఇందుకు ప్రస్తుతం 'తలపతి65' హ్యాష్‌ట్యాగ్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విజయ్-మురుగదాస్ కాంబినేషన్‌లో 'తుపాకీ', 'కత్తి', 'సర్కార్' సినిమాలు తెరకెక్కాయి.
ఇదీ చదవండి:కరోనా సూచనలు పాటించాలంటున్న ప్రియాంకా చోప్రా