'బిగ్‌బాస్' హౌజ్‌లో(bigg boss nagarjuna 5) యువ నటుడు విజయ్ దేవరకొండ సందడి చేశారు. తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేసి హౌజ్‌మేట్స్‌ను అలరించారు(vijay devarakonda bigg boss). దీపావళి పండగ సంబరాల్లో భాగంగా కొందరు సినీ తారల్ని 'బిగ్‌బాస్' ఆహ్వానించాడు(vijay devarakonda bigg boss episode). ఈ నేపథ్యంలోనే దేవరకొండ బ్రదర్స్‌తోపాటు నాయికలు శ్రియ, అవికా గోర్, బుల్లితెర వ్యాఖ్యాత సుమ, గాయని సునీత 'బిగ్‌బాస్' హౌజ్‌లో అడుగుపెట్టారు. దీపావళి శోభని ముందుగానే తీసుకొచ్చారు. డ్యాన్స్, పాటలతో మాంచి వినోదం పంచారు.
Bigg boss telugu 5: 'బిగ్‌బాస్'లో దేవరకొండ బ్రదర్స్ హంగామా - vijay devarakonda bigg boss
నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్‌బాస్'(bigg boss nagarjuna 5) షోలో దీపావళి సందడి ముందే మొదలైంది. ఈ కార్యక్రమానికి దేవరకొండ బ్రదర్స్, యాంకర్ సుమ, గాయని సునీత, నాయికలు శ్రియ, అవికా గోర్ అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను చూసేయండి...
ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులంతా రెండు బృందాలుగా ఏర్పడి, క్విజ్‌లో పాల్గొన్నారు. కార్యక్రమ వ్యాఖ్యాత నాగార్జున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ‘పౌరాణిక చిత్రాల పేర్లు చెప్పండి’ అని నాగార్జున అడగ్గా 'మహాభారతం, రామయాణం, కృష్ణార్జున యుద్ధం, అర్జున్ రెడ్డి' అని ప్రియాంక సమాధానమిచ్చింది. 'అర్జున్ రెడ్డా..! అయిపోయింది.. నువ్వు ఎలిమినేటేడ్' అంటూ ప్రియాంకని ఓ ఆట ఆడుకున్నాడు విజయ్ దేవరకొండ. షణ్ముఖ్‌ను ఉద్దేశించి గాయని సునీత ఆలపించిన 'రేసుగుర్రం' చిత్రంలోని 'స్వీటీ' పేరడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమ తన మాటల పటాసులు పేల్చింది. ఈ అల్లరితోపాటు ఇంకా ఏఏ విశేషాలు ఉన్నాయి? తెలియాలంటే కొన్ని క్షణాలు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోలు చూసి ఆనందించండి..
ఇదీ చూడండి: 'నా దుస్తులు చించేశారు.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా'