తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తొలి సంపాదన తమ్ముడిదే: విజయ్ దేవరకొండ - vijaydevarakonda liger movie

తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఓ ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించారు దేవరకొండ బ్రదర్స్​ విజయ్​, ఆనంద్​. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ తొలి సంపాదనతోనే కుటుంబానికి ఆర్థికంగా భరోసా దక్కిందని విజయ్ తెలిపారు. ఇంకా పలు సంగతులను పేర్కొన్నారు. ఆ సంగతులు వారి మాటల్లోనే..

vijay
విజయ్​

By

Published : Oct 25, 2021, 8:06 PM IST

తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ తొలి సంపాదనతోనే కుటుంబానికి ఆర్థికంగా భరోసా దక్కిందని యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తెలిపారు. డెలాయిట్​లో తన తమ్ముడికి ఉద్యోగం వచ్చిన క్షణాన ఇంట్లో ఎంతో భావోద్వేగానికి గురయ్యామని గుర్తుచేసుకున్నారు. ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'పుష్పక విమానం' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సోదరులు ఇద్దరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. పాఠశాల రోజుల నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన క్షణాల వరకు తమ అనుభూతులను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

దేవరకొండ బ్రదర్స్​ స్పెషల్​ వీడియో

ఇద్దరిలో అమ్మ ఫేవరెట్​ ఎవరు?

విజయ్​: చిన్నప్పటి నుంచి నేనే అమ్మ ఫేవరెట్, తమ్ముడు ఆనంద్​ నాన్న ఫేవరెట్​. నాకు వాడు చుక్కలు చూపించేవాడు.

స్టడీస్​లో ఇద్దరిలో బెటర్​ ఎవరు?

విజయ్​: తమ్ముడే బెటర్​​

స్పోర్ట్స్​లో ఎవరు?

విజయ్​: తమ్ముడే బెటర్​. కానీ ఇద్దరం బాగా ఆడేవాళ్లం. కెరీర్​ విషయానికొస్తే సినిమానే నా కెరీర్​.

ఆనంద్​ : స్పోర్ట్స్​నే నా కెరీర్​గా ఎంచుకుంటా. కానీ ఇక్కడ అంత సౌకర్యాలు లేవు. అందుకే సినిమాల్లోకి వచ్చా. ​

​ఇద్దరిలో ట్రబుల్​ మేకర్​ ఎవరు?

విజయ్: ట్రబుల్​ ఎప్పుడు నా నుంచే వస్తుంది. డ్రామా, ట్రబుల్​ ఎక్కువగా నేను చేసే పనుల వల్లే వస్తాయి.

ఫ్యామిలీ కోసం ఎవరు ముందుగా సంపాదించారు?

విజయ్​: తమ్ముడే ముందు. డబ్బుల కోసం చిన్నచిన్నవి చేశాం. వీడికి డెలాయిట్​లో ఉద్యోగం వచ్చిందని చెప్పగానే అందరం భావోద్వేగానికి గురయ్యాం. అదే తొలి సంపాదన.

రిలేషన్​షిప్స్​ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి?

విజయ్: ఆనంద్​ మ్యారేజ్​ మెటేరియల్​. ఒక్కసారి ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటాడు. నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కెరీర్​ గురించే ఎక్కువగా ఆలోచిస్తా. రిలేషన్​షిప్​ కోసం సమయం కేటాయించలేను. పెళ్లి కూడా ముందు వీడికే జరుగుతుంది.

ఎక్కువ డబ్బులు ఎవరు ఖర్చుచేస్తారు?

ఆనంద్​: అన్నయ్యనే. బట్టలు ఎక్కువ కొంటాడు. బయట తిరుగుతాడు.

గిఫ్ట్స్ ఎవరు ఎక్కువగా కొంటారు?

ఆనంద్​:అన్నయ్యనే. వాడికి గర్ల్​ ఫ్రెండ్స్​ ఎక్కువ.

ఫస్ట్​ కార్, ఇళ్లు​ ఎవరు కొన్నారు?

విజయ్​:నేనే

ఇదీ చూడండి: ముంబయి రోడ్లపై దర్శకుడు పూరీకి విచిత్ర అనుభవం

ABOUT THE AUTHOR

...view details