ఇటీవలే తన హార్ట్ బ్రేక్ అయ్యిందని నటుడు, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అన్నారు. ప్రస్తుతం తాను బ్రేకప్ బాధలో ఉన్నట్లు చెప్పారు. తన సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'పుష్పక విమానం' సినిమా ప్రమోషన్స్‌లో గత కొన్నిరోజుల నుంచి విజయ్ సూపర్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.
దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ నిర్మాతగా వ్యవహరించారు. నవంబర్ 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఈ ఇద్దరు సోదరులు సరదా చాట్‌లో పాల్గొన్నారు. 'పుష్పక విమానం', దేవరకొండ సోదరుల గురించి గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన ప్రశ్నలకు వీళ్లిద్దరూ సమాధానం ఇచ్చారు. ఆ విశేషాలు మీకోసం..
'పుష్పక విమానం' ఏ జోనర్ సినిమా?
విజయ్: సాధారణంగా తెలుగు సినిమాలు కేవలం ఒక్క జోనర్‌కు మాత్రమే పరిమితం కావు. లవ్, యాక్షన్, కామెడీ... ఇలా అన్ని రకాల యాంగిల్స్ ఒకే కథలో చూపిస్తారు. 'పుష్పక విమానం' గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఎక్కువగా కామెడీ ఉంటుంది. కథ విన్నాక మేం ఎంతో నవ్వుకున్నాం. అలాగే ఈ సినిమాలో ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ చిత్రాన్ని కామెడీ థ్రిల్లర్‌గా చెప్పుకొవచ్చు.
ఇది ఒరిజినలా? లేదా రీమేక్ చిత్రమా?
విజయ్: 100 శాతం ఒరిజినల్ కథనే. రీమేక్ కాదు. సినిమా విడుదలయ్యాక మిగిలిన భాషల్లో రీమేక్ అయ్యే అవకాశం ఉంటుంది.
విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించడానికి గల కారణమేమిటి?
విజయ్: డైరెక్టర్ దామోదర్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. నటుడిగా కెరీర్ ప్రారంభమై.. కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలోనే అతనితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పుడు తను ఓ రచయిత. సడెన్‌గా అతను 'పుష్పక విమానం' కథతో ఆనంద్‌ను కలిశాడు. ఆనంద్ హీరోగా ఓకే చెప్పాక.. నేనూ కథ విన్నాను. నిర్మాతగా చేయాలనిపించింది. అలా, ఈ టీమ్‌లోకి నేను ఎంట్రీ ఇచ్చాను. మరో విషయం ఏమిటంటే.. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా టైమ్‌లోనే దామోదర నాకు ఓ కథ చెప్పాడు. ఇప్పుడు అదే కథను నేను నిర్మాతగా వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తున్నాను.
ఆనంద్ దేవరకొండ ఎందుకని కేవలం కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు?
ఆనంద్: పేరు పొందిన దర్శకుల సినిమాల్లో అవకాశాలు రావడం లేదు కాబట్టి..(నవ్వులు.. మధ్యలో విజయ్ అందుకుని ఇప్పుడే అవకాశాలు రావు. ఇంకా సమయం పడుతుంది అని అన్నాడు). కొత్త డైరెక్టర్లతో వర్క్ చేస్తే విభిన్నమైన కథల్లో నటించే అవకాశం ఉంటుంది. అందుకే నాకు వచ్చిన అవకాశాలను నటుడిగా సద్వినియోగం చేసుకుంటున్నాను.
'పుష్పక విమానం' ఫైనల్ కాపీ చూశాక విజయ్ రియాక్షన్ ఏమిటి?
ఆనంద్: అది విజయ్ మాత్రమే చెప్పగలడు.
విజయ్: సాధారణంగా నేను ఏ సినిమా చూసినా నా రియాక్షన్ ఒకేలా ఉంటుంది. ఏం మాట్లాడకుండా.. ఎలాంటి రియాక్షన్ లేకుండా ప్రతి సీన్‌ని అలా చూస్తూ ఉండిపోతాను. 'పుష్పక విమానం' కూడా అలాగే చూశాను. ఫైనల్ కాపీ నాకు నచ్చింది.
ఆనంద్: యూఎస్‌లో ఉద్యోగం వదిలేసి ఇండియాకి వచ్చి కొన్ని నెలలపాటు ఖాళీ ఉండి.. సినిమాల్లోకి వస్తాను అని చెప్పినప్పుడు నీ రియాక్షన్ ఏమిటి?
విజయ్: నాకు అంతగా గుర్తులేదు. కానీ, ఆ మాట విని నవ్వుకున్నాను.
ఆనంద్: "సినిమా అవకాశం వచ్చింది. ఆనంద్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు" అని నాన్న నీతో చెప్పారు. ఆ సమయంలో నువ్వు డిన్నర్ చేస్తున్నావు. నేను వేరే రూమ్‌లో ఉండి.. నువ్వు ఏం అంటావా?అని వింటున్నాను. నాన్న చెప్పడం పూర్తి కాగానే.. ఆయన జోక్ చేస్తున్నారనుకుని నువ్వు గట్టిగా నవ్వావు. 'అన్నయ్య ఏంటి ఇలా నవ్వుతున్నాడు' అని అనుకున్నాను.
'పుష్పక విమానం'లో మీకు బాగా నచ్చిన సాంగ్
విజయ్: సిలకా..
ఆనంద్: కల్యాణం పాట ఇష్టం. అందులో వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. ఆ సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఏ పెళ్లిలో విన్నా ఈ పాటే వినిపిస్తోంది. అదీ కాక.. సిద్ శ్రీరామ్ మొదటిసారి నా సినిమా కోసం పాట పాడాడు.
ఆనంద్ దేవరకొండ మొదటి సంపాదన ఎంత?