'పెళ్లి చూపులు' సినిమాతో అరంగేట్రం చేసి 'అర్జున్ రెడ్డి' చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. 'దొరసాని' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ఈ సోదరులిద్దరూ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారని సినీ వర్గాల సమాచారం.
విజయ్, ఆనంద్ కలిసి ఒకే చిత్రంలో నటించబోతున్నారట. అయితే అది ఒకరి సినిమాలో మరొకరు ప్రత్యేక పాత్రలో కనిపిస్తారా? లేదా పూర్తిస్థాయి పాత్రల్లో దర్శనమిస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.