తమిళ స్టార్ హీరో విజయ్ 65వ చిత్రం బుధవారం ప్రారంభమైంది. చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
విజయ్ కొత్త సినిమా.. 'తిమ్మరుసు' రిలీజ్ డేట్ - విజయ్ 65వ చిత్రం ప్రారంభం
కొత్త చిత్రాల అప్డేట్స్ వచ్చేశాయి. విజయ్ కొత్త సినిమా లాంఛనంగా మొదలవడం, సత్యదేవ్ 'తిమ్మరుసు' విడుదల గురించి ఇందులో ఉంది.

తిమ్మరుసు
టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'తిమ్మరుసు'. సత్యదేవ్ ఇందులో న్యాయవాదిగా కనిపించనున్నారు. మే 21న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదీ చూడండి: చిట్టి గౌనులో క్యూట్ సారా.. ఫ్యాన్స్ ఫిదా!