అభిమానులకు దగ్గరగా ఉండే హీరోల్లో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఒకరు. వారి శ్రేయోభిలాషిగా ఫ్యాన్స్‌తోనే ఉంటూ ఎప్పటికప్పుడు తన గొప్పతనాన్ని చాటుతూనే ఉంటాడు. తాజాగా ఓ అభిమాని పుట్టినరోజు వేడుకను దగ్గరుండి జరిపించాడు.
లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో థళపతి 64 అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఇటీవలే చెన్నై, దిల్లీలో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ కర్ణాటక శివమొగ్గలో జరుగుతోంది. అక్కడ ఓ అభిమాని పుట్టినరోజు సందర్భంగా అతడితో కేకు కట్చేయించి వేడుకలో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.