తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరోయిన్ నయనతార మధ్య గత కొన్నేళ్లుగా ప్రేమాయణం కొనసాగుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. ఈ విషయమై ఇప్పుడు స్పందించాడీ డైరెక్టర్.
"నయన్‌తో వివాహం గురించి చాలామంది అడుగుతున్నారు. త్వరలోనే మేమిద్దరం ఒక్కటవ్వనున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం లేదు. ప్రస్తుతం మా కెరీర్‌పైనే దృష్టి సారించాం. మా లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. వాటిని సాధించిన తర్వాతే వివాహం చేసుకోవాలనుకుంటున్నాం. ఇంతకన్నా మరో కారణం లేదు. మాకు తెలియకుండా చాలా ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పట్లో అయితే ఎలాంటి ఆలోచన లేదు"