తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా పిల్లలకు కాబోయే తల్లి'.. నయన్​పై విఘ్నేశ్ కామెంట్

మాతృ దినోత్సవం సందర్భంగా తన ప్రేయసి నయనతారకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు విఘ్నేశ్ శివన్. "నా పిల్లలకు కాబోయే తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశాడు.

నయన్
నయన్

By

Published : May 11, 2020, 7:14 PM IST

Updated : May 11, 2020, 7:43 PM IST

మాతృ దినోత్సవం సందర్భంగా తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తన ప్రేయసి నయనతారకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు. లేడీ సూపర్‌స్టార్‌ ఓ బాబును ఎత్తుకుని ఉన్న చక్కటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

"నా పిల్లలకు కాబోయే తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు" అని విఘ్నేశ్ ట్వీట్ చేశాడు. అతడి మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. నయన్‌ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అది విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్లినప్పుడు తీసిన ఫొటోగా తెలుస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంగా నయన్‌ తల్లి డయనా కురియన్‌ను కూడా విఘ్నేశ్‌ విష్‌ చేశారు. అందమైన అమ్మాయికి జన్మనిచ్చి, గొప్ప పని చేశారని అన్నాడు.

2015లో 'నేనూ రౌడీనే..' చిత్రం ద్వారా నయన్‌, విఘ్నేశ్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమాకు విఘ్నేశ్‌ దర్శకత్వం వహించగా.. నయన్‌ కథానాయికగా నటించింది. ఆ పరిచయం కాస్తా స్నేహానికి దారి తీసి, ప్రేమగా మారింది. వీరిద్దరు అనేక మార్లు విహారయాత్రలకు కలిసి వెళ్లారు.

Last Updated : May 11, 2020, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details