తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Viral Video: ముక్కులోకి పాము దూర్చుకున్న వ్యక్తి - ట్రెండింగ్​ న్యూస్ టుడే

బాలీవుడ్​ నటుడు విద్యుత్ జమ్వాల్​ ఇన్​స్టాలో షేర్​ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్​లో వైరల్​గా మారింది. ఓ వ్యక్తి పామును ముక్కులోకి దూర్చుకున్న దృశ్యాలను చూసి నెటిజన్లు వాపోతున్నారు. సున్నిత మనస్కుల వారు ఈ వీడియో చూడొద్దని విద్యుత్ ముందుగానే హెచ్చరించాడు. అదేంటో మీరూ చూసేయండి.

Vidyut Jammwal shares video of man inserting snake into his nose
Viral Video: ముక్కులోకి పాము దూర్చుకున్న వ్యక్తి

By

Published : Jul 3, 2021, 1:57 PM IST

Updated : Jul 4, 2021, 11:57 AM IST

పామును చూస్తే భయంతో ఆమడ దూరం పరుగెడతాం. అవి హానికరమైనవని దూరంగా ఉంటాం. కానీ ఓ వ్యక్తి పామును తన ముక్కులోకి దూర్చుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్​ ఇలాంటి వైరల్​ వీడియోనే తన ఇన్​స్టాలో పోస్టు చేశాడు. సున్నిత మనస్కుల వారు ఈ వీడియో చూడొద్దని హెచ్చరించి మరీ షేర్ చేశాడు.

వీడియోలో ఓ వ్యక్తి ప్రాణంతో ఉన్న చిన్న పామును తన ముక్కులోకి దూర్చుకొని.. ఆ తర్వాత నోటిలో నుంచి బయటకు తీశాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ 'ఐ లవ్ మై ఇండియా' అని రాసుకొచ్చాడు విద్యుత్ జమ్వాల్​.

అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు వీడియోను ఆస్వాదించారు. మరికొందరు మాత్రం ఇది పామును హింసించడం కాదా? అని ప్రశ్నించారు. అసలు పామును ముక్కులోకి దూర్చుకోవాల్సిన అవసరమేంటని మరికొందరు అభ్యంతరం తెలిపారు.

Last Updated : Jul 4, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details