తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి అలాంటి పాత్రలో విద్యాబాలన్​ - విద్యాబాలన్​ కొత్త సినిమా

తనతో 'తుమ్హారీ సులు' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్న సంస్థ ఎలిప్సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది నటి విద్యాబాలన్​. ఈ చిత్రంలో ఆమె సహజత్వ పాత్రలో కనిపించనుంది.

vidyabalan
విద్యాబాలన్​

By

Published : May 16, 2021, 6:53 AM IST

అందచందాలతోనే కాదు.. అద్భుతమైన నటనతో భారతీయ సినీ ప్రేక్షకుల మనసు దోచిన విద్యాబాలన్‌ మరో సహజత్వ పాత్రకు ఓకే చెప్పింది. విద్యాబాలన్‌తో 'తుమ్హారీ సులు' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్న సంస్థ ఎలిప్సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో మరోసారి కలిసి పనిచేయడానికి ఆమె పచ్చజెండా ఊపింది.

ఇటీవలే దీని నిర్మాతలు తనూజ్‌, అతుల్‌లు ఆమెకు స్క్రిప్ట్‌ వినిపించారట. ఇందులో ఆమె పాత్ర సహజంగా, బలంగా ఉంటుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, ముంబయిలో మొత్తం 45 రోజుల భారీ షెడ్యూల్‌ను దీనికోసం రూపొందించారు.

ఇదీ చూడండి: అందుకే నేను లావుగా ఉన్నా: విద్యాబాలన్​

ABOUT THE AUTHOR

...view details