తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బ్లౌజ్‌ పీస్​తో మాస్క్ తయారు చేసిన విద్యా‌బాలన్ - సినిమా వార్తలు

బాలీవుడ్​ నటి విద్యాబాలన్..​ బ్లౌజ్​ పీస్​, రెండు రబ్బరు బాండ్లతో మాస్క్ ఎలా​ తయారు చేసుకోవాలో చెబుతూ వీడియోను పోస్ట్ చేసింది.

VidyaBalan making mask with blouse cloth video post  in Instagram
బ్లౌజ్‌ పీస్‌, రెండు రబ్బరు బాండ్లతో మాస్క్‌

By

Published : Apr 19, 2020, 2:53 PM IST

కరోనా బారినపడి ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. భారత్‌లోనూ ఈ వైరస్‌ విజృంభిస్తోంది. అయితే ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో మాస్క్‌ల కొరత ఏర్పడింది. దీంతో ఇంట్లో ఉండే వస్త్రాలతోనే మాస్క్‌లను తయారు చేసుకోవడం గురించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వీడియోలు చేసి చూపించారు. ఇప్పుడు బాలీవుడ్‌ నటి విద్యాబాలన్..‌ బ్లౌజ్‌ పీస్‌, రెండు రబ్బరు బాండ్లతో దీనిని ఎలా తయారు చేసుకోవచ్చో చెప్పింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. "పూర్తి చీరతో మనం మరెన్నో మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు. హోమ్‌ మేడ్‌ మాస్క్‌, మన దేశం.. మన మాస్క్‌" అంటూ రాసుకొచ్చింది.

గతేడాది వచ్చిన 'మిషన్ మంగళ్‌' సినిమాలో విద్యాబాలన్‌ నటించింది. ప్రస్తుతం 'శకుంతలా దేవి' సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రముఖ గణితశాస్త్ర నిపుణురాలు, 'హ్యూమన్‌ కంప్యూటర్‌'గా పేరుపొందిన శకుంతలా దేవి జీవితం ఆధారంగా దీనిని తీస్తున్నారు. అనుమీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి :ఆ ఆటలో అనుష్కను ఓడించిన కెప్టెన్ కోహ్లీ!

ABOUT THE AUTHOR

...view details