తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2020, 12:10 PM IST

ETV Bharat / sitara

'శకుంతలా దేవి' కోసం విద్యాబాలన్ ఐదు అవతారాలు

బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'శకుంతలా దేవి'. మానవ కంప్యూటర్​గా ఖ్యాతి పొందిన గణిత శాస్త్రజ్ఞురాలు శకుంతలా దేవి జీవితాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. సినిమాలోని ప్రధాన పాత్ర కోసం ఐదు విభిన్న రూపాల్లో విద్యా బాలన్​ను రెడీ చేశామని చిత్రబృందం తెలిపింది.

Vidya Balan's different on-screen looks that define Shakuntala Devi
శకుంతలా దేవి కోసం ఐదు విభిన్న రూపాల్లో విద్యాబాలన్​

ప్రముఖ గణిత శాస్తజ్ఞురాలు శకుంతలా దేవి బయోపిక్​ కోసం నటి విద్యాబాలన్​పై ఐదు విభిన్న రూపాలను ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విద్యాబాలన్​ రూపాల వెనుక శ్రేయస్​ మత్రే, శాలకా భోస్లే, నిహారికా భాసిన్​ వంటి నిపుణులు ఉన్నారు. శకుంతలా దేవి పాత్రను తెరపై ప్రస్పుటించేలా చేయడానికి అనేక పరిశోధనలు చేయాల్సి వచ్చిందని వారు తెలిపారు.

ఐదు రకాల రూపాలు

"శకుంతలా దేవి వయసు ఆధారంగా విభిన్న రూపాలను సృష్టించాల్సి వచ్చింది. నేను శకుంతలా దేవిపై పరిశోధన చేశాను. ఆమె చిత్రాలతో పాటు ఆమె రూపాన్ని విద్యా బాలన్​ ముఖంతో సరిపోల్చడానికి ప్రయత్నించాను. విద్యా బాలన్​, దర్శకుడితో చర్చించిన తర్వాత చివరిగా ఐదు రకాల రూపాలను తయారు చేశాను" అని మేకప్​ ఉమెన్​ శ్రేయస్​ మత్రే వెల్లడించారు.

వివిధ రకాల శైలితో

సంక్లిష్టమైన గణిత గణనలను క్షణాల్లో చేయగల సహజ సామర్థ్యం కలిగి.. మానవ కంప్యూటర్​గా దివంగత శకుంతల దేవి ఖ్యాతి పొందారు. ఆమె జీవితంలో వివిధ దశల్లో వివిధ రకాల శైలిని కలిగి ఉండేవారు. 1940 నుంచి 2000 మధ్య శకుంతలా దేవి జీవితంలో వివిధ దశలు ఈ చిత్రంలో కనిపిస్తాయని ఈ సినిమాకు హెయిర్​ స్టైలిష్ట్​గా పనిచేసిన శాలకా భోస్లే తెలిపారు.

శకుంతలా దేవి గురించి పరిశోధన చేయడమే కాకుండా యూట్యూబ్​లో ఆమెకు సంబంధించిన వీడియోలను చూసి ఈ చిత్రంలోని కేశాలంకరణ చేసినట్లు శాలకా భోస్లే వెల్లడించారు.

పాత్రను తిరిగి సృష్టించాం

ఆ కాలంలో ఉన్న స్టైల్స్​ గురించి తెలుసుకుని ఆ పాత్రను పునః సృష్టించామని డిజైనర్​ నిహారికా భాసిన్​ తెలిపారు. మేకప్​, హెయిర్​ స్టైలిషింగ్​తో పోలిస్తే దుస్తుల ఎంపిక నిజంగా కష్టమవుతుందని భాసిన్​ వెల్లడించారు.

శకుంతలా దేవి బయోపిక్​కు అను మీనన్​ దర్శకత్వం వహించారు. ఇందులో శకుంతలా దేవి కుమార్తె అనుపమ పాత్రలో సన్యా మల్హోత్రా నటించగా.. అమిత్​ సాధ్​, జిషు సేన్​ గుప్తా కీలకపాత్రలు పోషించారు. నయనికా మహతానీ, మీనన్ స్క్రీన్​ప్లేను అందించగా.. ఇషితా మొయిత్రా డైలాగులు రాశారు. జులై 31న అమెజాన్​ ప్రైమ్​ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details