తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రియాకు మద్దతుగా విద్య ట్వీట్​.. నెటిజన్లు ట్రోల్స్​ - విద్యాబాలన్​

సుశాంత్​ మృతి కేసులో భాగంగా రియా చక్రవర్తిపై వస్తున్న మీడియా కథనాలను తప్పుబట్టింది బాలీవుడ్​ నటి విద్యాబాలన్​. అయితే, ఈ విషయంపై నెటిజన్లు బాలన్​ను వ్యతిరేకించారు. ట్రోలింగ్​ చేస్తూ ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Vidya Balan
విద్యా బాలన్​

By

Published : Sep 2, 2020, 4:08 PM IST

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మృతికి సంబంధించి రియా చక్రవర్తిపై మీడియాలో వస్తున్న కథనాలపై.. బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ ఇటీవలే విమర్శలు చేసింది​. అయితే, రియాకు మద్దతుగా మాట్లాడటంపై నెటిజన్లు బాలన్​ను వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే రకరకాల ట్రోల్స్​తో ట్విట్టర్​ వేదికగా ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవలే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా రియాకు మద్దతుగా నిలిచింది. సుశాంత్​, రియా ఇద్దరికీ న్యాయం చేయాలని కోరింది. లక్ష్మి అభిప్రాయాలను అంగీకరిస్తూ.. విద్యాబాలన్​ రీట్వీట్​ చేసింది. సుశాంత్​ సింగ్​ విషాద ఘటన మీడియా సర్కస్​గా మారడం దురదృష్టకరమని పేర్కొంది విద్య.

అయితే, 'సుశాంత్​ అనుమానాస్పద​ మృతిపై నోరు విప్పని విద్య.. ఇప్పుడు రియా విషయంలో ఆమె మనసు విరిగిపోయిందా' అంటూ ఓ నెటిజన్​ ట్వీట్​ చేశారు. 'గత రెండు నెలలుగా మీరు ఎక్కడికి వెళ్లారు' అని మరొకరు విమర్శించారు. ఇలా అనేక మంది విద్యా బాలన్​పై ట్వీట్ల వర్షం కురిపించారు.

ఇదీ చూడండి:'సుశాంత్​ కేసు మీడియా సర్కస్​గా మారిపోయింది'

సుశాంత్​ ఆత్మహత్యతో బాలీవుడ్​లో బంధుప్రీతిపై చెలరేగిన వివాదం.. అనేక మంది ప్రముఖులపై విమర్శలకు దారి తీసింది. హిందీ చిత్రసీమలో నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ సుశాంత్ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆలియా భట్​, కరీనా కపూర్​, అనన్య పాండే వంటి బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండిపోయారు.

ABOUT THE AUTHOR

...view details