బాలీవుడ్ నటి విద్యాబాలన్ (Vidya Balan) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'షేర్నీ' (Sherni). 'న్యూటన్' (Newton)తో ఆకట్టుకున్న అమిత్ మసుర్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ (Sherni Trailer) విడుదలైంది. ఇందులో అటవీ శాఖ అధికారిగా కనిపించింది విద్యా బాలన్.
Vidya Balan:'షేర్నీ' ట్రైలర్ వచ్చేసింది - విద్యా బాలన్ షేర్నీ ట్రైలర్ విడుదల
బాలీవుడ్ నటి విద్యా బాలన్ (Vidya Balan) ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'షేర్నీ' (Sherni). జూన్ 18న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
షేర్నీ
మనిషి-జంతు సంఘర్షణా ప్రపంచంలో సమతౌల్యం తెచ్చేందుకు పోరాడుతూ ఉంటుంది విద్య. అడవి నేపథ్యంలో సాగిన సన్నివేశాలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. మరి షేర్నీ అనుకున్నది సాధించిందా, లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాలో శరద్ సక్సేనా, ముకుల్ చద్ధా, విజయ్ రాజ్, అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కబి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మించాయి.