తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​బాబు​ సోదరిగా బాలీవుడ్ స్టార్​ నటి? - మహేశ్​బాబు వార్తలు

మహేశ్​ కొత్త సినిమాలో అతడికి సోదరిగా ప్రముఖ నటి విద్యాబాలన్​ కనిపించనుందని సమాచారం. నవంబరు నుంచి ఈ చిత్ర షూటింగ్ యూఎస్​ఏలో జరగనుంది.

Vidya Balan plays sister role in Mahesh Babu Sarkaru Vaari paata
నటి విద్యాబాలన్

By

Published : Sep 16, 2020, 3:20 PM IST

Updated : Sep 16, 2020, 3:28 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇంతలో చిత్రంలోని నటీనటుల ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

ఇందులో మహేశ్​కు సోదరిగా బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ నటించనున్నారట. ఈ విషయమై ఆమె కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే అనిల్ కపూర్​ ప్రతినాయకుడిగా కనిపించనున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటన్నింటిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

అమెరికా డెట్రాయిట్‌ నగరంలో షూటింగ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. సుమారు నలభైఐదు రోజుల పాటు ఈ షెడ్యూల్​ సాగనుంది. పరశురామ్​ దర్శకత్వం వహిస్తుండగా, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేశ్ హీరోయిన్. తమన్‌ సంగీతమందిస్తున్నారు.

Last Updated : Sep 16, 2020, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details