తెలంగాణ

telangana

విద్యాబాలన్​ 'నట్​ఖట్'​కు అరుదైన గౌరవం

By

Published : Nov 9, 2020, 7:19 AM IST

బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ నటించిన లఘుచిత్రం 'నట్​ఖట్'​.. ఈ ఏడాదికి గానూ భారతీయ లఘు చిత్ర పురస్కారాల్లో విజేతగా నిలిచింది. దీంతో ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డుల పరిశీలనకు నేరుగా అర్హత సాధించింది.

Vidya balan
నట్​ఖట్

బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ ప్రధాన పాత్రలో నటించిన లఘుచిత్రం 'నట్​ఖట్'​ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ ఫిల్మ్​ 2020 ఏడాదికి గానూ భారతీయ లఘు చిత్ర పురస్కారాల్లో విజేతగా నిలిచింది. ఈ విజయంతో .. ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డుల పరిశీలనకు నేరుగా అర్హత సాధించింది. ఈ విషయాన్ని విద్యా​ ఇన్​స్టా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

"నేను భాగమైన 'నట్​ఖట్'​.. 3వ భారత లఘు చిత్ర పురస్కారాల్లో విజేతగా నిలిచింది. అంతేకాదు.. ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డుకు అర్హత సాధించింది." అని విద్యా బాలన్​ రాసుకొచ్చింది.

పితృస్వామ్య పోకడలు, లింగ వివక్ష, గృహ హింసకు వ్యతిరేకంగా దర్శకుడు షాన్​ వ్యాస్​ ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో విద్యా.. సోనూ అనే ఆకతాయి బాలుడికి తల్లిగా నటించారు. ఆమె ఈ చిత్రాన్ని రోనీతో కలిసి స్వయంగా నిర్మించడం మరో విశేషం.

ఇదీ చూడండి : కరోనా తర్వాత ముఖానికి రంగేసిన విద్యాబాలన్‌!

ABOUT THE AUTHOR

...view details