బాలీవుడ్ భామ విద్యాబాలన్ బయోపిక్‌లపై ఆసక్తి చూపిస్తుంది. తెలుగులో 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాల్లో బసవతారకం పాత్రలో ఒదిగిపోయింది. ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ 'మిషన్ మంగళ్'లో స్పేస్ సైంటిస్ట్ తారా షిండే పాత్రలో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం మరో జీవిత కథలో నటించడానికి సిద్ధమవుతోంది.
గణిత మేధావి శంకుతలా దేవిగా కనిపించనుంది విద్యాబాలన్. హ్యూమన్ కంప్యూటర్‌గా పిలుచుకునే శకుంతల పాత్రలో ఒదిగిపోయేందుకు సిద్ధమైందీ నటి.