అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(Oscars 2022)లో సభ్యులుగా చేరాలని ఈ ఏడాదికి గానూ 395 కళాకారులు, ఎగ్జిక్యూటివ్స్‌కు ఆహ్వానం అందింది. వీరిలో బాలీవుడ్ నటి విద్యా బాలన్‌తో పాటు (Vidya Balan Ekta Kapoor) నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్ ఇందులో ఉన్నారు.
ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన వారికి, వచ్చే ఏడాది మార్చి 27న జరిగే 94వ ఆస్కార్ అవార్డుల విజేతలను ఎంపిక చేసే ప్రక్రియలో ఓటు హక్కు లభిస్తుంది. ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఆస్కార్ గ్రహీతలు యుహ్-జంగ్ యున్, ఎమరాల్డ్ ఫెన్నెల్, ఫ్లోరియన్ జెల్లర్ ఉన్నారు. ఆండ్రా డే, హెన్రీ గోల్డింగ్, వెనెస్సా కిర్బీ, రాబర్ట్ ప్యాటిన్సన్, యాహ్యా అబ్దుల్-మతీన్ IIకు కూడా ఈ ఏడాది ఆహ్వానం లభించింది.
ఎంతమందికి అవకాశం
94వ అకాడమీ అవార్డ్స్ వేడుకను 2022 మార్చి 27న నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది కేవలం 395 మందిని మాత్రమే ఆహ్వానించారు. గతేడాది 819 మందిని ఓటింగ్ ప్రక్రియ కోసం పిలవగా.. ఇప్పుడు అందులో దాదాపు సగం మందినే అనుమతించడం గమనార్హం. ఈ ఏడాది అహ్వానం పొందిన వారిలో 46 శాతం మంది మహిళలు, 39 శాతం పురుషులు ఉన్నారు. ఇందులో పాల్గొనేందుకు దాదాపుగా 49 దేశాల(అమెరికా కాకుండా) నుంచి సినీ ప్రముఖులు తరలి రానున్నారు. వీరిలో 89 మంది గతంలో ఆస్కార్‌కు నామినేట్ అవ్వగా.. 25 మంది ఆస్కార్ గ్రహీతలు ఉన్నారు.