తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పీపీఈ కిట్స్‌ విరాళమిచ్చిన విద్యాబాలన్ - Vidya balan Donation towards Corona

తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా బాధితులకు సేవ చేస్తున్నారు వైద్యులు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి బాలీవుడ్ నటి విద్యా బాలన్ వేయి పీపీఈ కిట్స్​ను విరాళంగా అందించింది.

విద్యా
విద్యా

By

Published : Apr 25, 2020, 6:03 PM IST

ప్రపంచ మానవాళి జీవితాలను బలితీసుకుంటున్న మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19). ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్యసేవలను అందిస్తున్న వైద్య సిబ్బందికి బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ 1000 పీపీఈ కిట్స్‌ను విరాళంగా అందజేసింది. అంతేకాదు ఈ సంక్షోభ సమయంలో అందరూ వారికి అండగా నిలవాలని కోరుతోందీ 'మిషన్‌ మంగళ్‌' నటి. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.

"నమస్తే ఇప్పుడు మనందరం మన ఆరోగ్య రక్షణ సైనికులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి కోసం ప్రతి ఒక్కరూ తమవంతుగా సహాయం చేయాలి. ఈ పీపీఈ కిట్స్‌ నిధికి సహకరించే ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు."

-విద్యాబాలన్‌, హీరోయిన్

తెలుగు నటి సిల్క్‌ స్మిత జీవితాధారంగా వచ్చిన 'డర్టీ పిక్చర్‌' చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది విద్యాబాలన్. అటు హిందీ చిత్రాలతో పాటు దక్షిణాది చిత్రాల్లోను నటిస్తోంది. ప్రస్తుతం 'హ్యూమన్‌ కంప్యూటర్‌'గా పిలుచుకుంటున్న గణిత మేధావి శకుంతలాదేవి బయోపిక్‌లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details