తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​ కేసు మీడియా సర్కస్​గా మారిపోయింది' - Don't make SSR's death case a media circus

సుశాంత్​ రాజ్​పుత్ కేసును మీడియా వక్రదృష్టితో చూడటం దురదృష్టకరమని బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ పేర్కొంది. ఇటీవలే లక్ష్మీ మంచు చేసిన ట్వీట్​కు స్పందనగా విద్య ఈ వ్యాఖ్యలు చేసింది.

Vidya Balan
విద్యా బాలన్​

By

Published : Sep 1, 2020, 8:31 PM IST

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ కేసు మీడియా సర్కస్​గా మారిపోవడం దురదృష్టకరమని బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ మంగళవారం తెలిపింది. రియా చక్రవర్తిపై వస్తున్న వార్తా కథనాలపైనా విమర్శించింది. ఇటీవలే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ట్విట్టర్​ వేదికగా రియాపై స్పందించింది. సుశాంత్​, రియా ఇద్దరికీ న్యాయం చేయాలని కోరింది. ఈ క్రమంలోనే లక్ష్మి అభిప్రాయాలతో అంగీకరిస్తూ.. విద్యాబాలన్​తో పాటు నటి తాప్సీ కూడా రీట్వీట్​ చేసింది.

"ఈ విషయంలో మనసులో మాట చెప్పావు మంచు లక్ష్మి. గాడ్​ బ్లెస్​ యూ. సుశాంత్​ సింగ్​ విషాద ఘటన మీడియా సర్కస్​గా మారడం చాలా దురదృష్టకరం. అదే క్రమంలో రియా చక్రవర్తిపై లేనిపోని అబాండాలు వేయడం చూసి నా మనసు విరిగిపోయింది. ఒకరు నిర్దోషిగా నిరూపించుకునే వరకు దోషిగా నిలబడాల్సిందేనా. ఒక్కసారైనా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులపై గౌరవం కలిగి ఉందాం."

-విద్యాబాలన్​, సినీ నటి

మంచు లక్ష్మి పోస్టుకు అనేక మంది తారలు మద్దతుగా నిలిచారు. అయితే, సుశాంత్​ మేనకోడలు మల్లికా సింగ్​ లక్ష్మి అభిప్రాయాలను ఖండించింది. సహచరులకు మద్దతుగా నిలబడటాన్ని అకస్మాత్తుగా గుర్తుచేసుకోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని మల్లికా పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details