మహానటి సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలని సంకల్పించి విజయం అందుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకున్నారు. బయోపిక్ అంటే అంత సులభం కాదు. స్క్రిప్ట్ పక్కాగా ఉన్నా.. ఆయా పాత్రలకు ఎవరైతే న్యాయం చేయగలరా అని పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
సినీ డైరీ: 'మహానటి'గా వీళ్లని అనుకున్నారట! - మహానటి పాత్రకు సోనాక్షి సిన్హా
మహానటి సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించి విజయం అందుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేశ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే కీర్తి కంటే ముందు మరికొంత మంది హీరోయిన్లను పరిశీలించిందట చిత్రబృందం.
![సినీ డైరీ: 'మహానటి'గా వీళ్లని అనుకున్నారట! Vidya Balan and Sonakshi Sinha considered for Mahanati role](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9412321-703-9412321-1604384764659.jpg)
అలాంటిది మహానటిగా తెలుగువారి మన్ననలు అందుకున్న సావిత్రి పాత్రను పోషించాలంటే? ఇదే సందేహం ఉండేది 'మహానటి' చిత్రబృందానికి. ఎందరో నాయికల్ని అన్వేషించగా కీర్తి సురేశ్ ఎంపికైంది. ఆమె నటనతో సావిత్రినే మైమరపించింది. అయితే కీర్తి ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టక ముందు దర్శకుడి మదిలో బాలీవుడ్ నాయికలూ మెదిలారు. విద్యా బాలన్, సోనాక్షి సిన్హాని అనుకున్నారు. కానీ వాళ్లని సంప్రదించలేదు. కీర్తి స్థానంలో విద్యా బాలన్ లేదా సోనాక్షి ఉంటే ఎలా ఆకట్టుకునేవారో!! తమిళ నటి అమలాపాల్ కూడా ఈ జాబితాలో నిలుస్తుంది.