'పెళ్లి చూపులు' చిత్రంతో ఆకట్టుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. చాలా తక్కువ బడ్జెట్‌తో, చక్కటి స్క్రిప్టుతో ఓ సినిమా తీసి, దాన్ని హిట్ చేశాడు. ఆ వెంటనే వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రమూ ఆర్థిక లాభాల్ని తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి తరుణ్ నుంచి మరో సినిమా రాలేదు. ఈలోగా నటుడిగా బిజీ అయినా, దర్శకుడిగా ఖాళీనే. వెంకటేశ్‌కి ఓ కథ చెప్పడం, అది నచ్చడం జరిగాయి. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇదే సమయంలో వెంకీ 'అసురన్' రీమేక్‌నీ ఎంచుకున్నాడు. ఈ దశలో తరుణ్ భాస్కర్ సినిమా ఉంటుందా, లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
త్వరలో పట్టాలెక్కనున్న వెంకీ-తరుణ్ చిత్రం..! - victory venktesh-tarun bhaskar
యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో విక్టరీ వెంకటేశ్ ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ వెంకీ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో మూవీ తెరకెక్కనుందని సమాచారం.
అయితే... వెంకటేశ్ నుంచి ఇప్పుడు తరుణ్‌కి పిలుపొచ్చింది. స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధం చేయమని, జనవరిలో షూటింగ్ చేయాల్సివచ్చినా, రెడీగా ఉండాలని చెప్పాడట. ఫలితంగా తరుణ్ నిరీక్షణ ఫలించినట్లు అయ్యింది. వెంకీ కోసం దాదాపు ఏడాదిగా ఎదురుచూస్తున్నాడు తరుణ్. క్రీడా నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో రేసర్‌గా కనిపించనున్నాడీ దగ్గుబాటి హీరో. 'అసురన్' రీమేక్.. తరుణ్ భాస్కర్ సినిమా రెండూ సమాంతరంగా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి.. గురువుపై ఉన్న ప్రేమను చాటుకున్న కమల్