టాలీవుడ్ హీరో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'మోసగాళ్లు'. ఇప్పటికే టైటిల్ పోస్టర్, టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమా టీజర్‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేయగా.. మరోసారి ఈ సినిమాకు స్టార్ హీరో మద్దతు లభించింది. తాజాగా విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. దీంతో ఈ విషయం ట్విట్టర్లో ట్రెండింగ్‌గా మారింది.
వెంకీమామ మద్దతుతో 'మోసగాళ్లు' ట్రెండింగ్ - మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'మోసగాళ్లు'. ఈ సినిమాకు స్టార్ హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
'మోసగాళ్ల'కు మద్దతిస్తోన్న వెంకటేశ్
చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో విష్ణుకు జోడీగా బాలీవుడ్ భామ రుహీ సింగ్ నటిస్తోంది. కాజల్ అగర్వాల్ అతడికి సోదరిగా కనిపించనుంది. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.