టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ కథలంటే వెంటనే గుర్తుకువచ్చే పేరు విక్టరీ వెంకటేశ్. 'కలియుగ పాండవులు' సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎఫ్2' వంటి మల్టీస్టారర్ చిత్రాలతో అలరించాడు. 'వెంకీమామ'గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజే అతడి పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలతో సహా 'వెంకీమామ' చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
"ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండే వ్యక్తి విక్టరీ వెంకటేశ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో గడిపిన సరదా సమయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. ఇలాంటి మరెన్నో సరదా క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను" -అనిల్ రావిపూడి, దర్శకుడు
"విక్టరీ వెంకటేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. అలాగే 'వెంకీమామ' చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్" -అనిల్ సుంకర, నిర్మాత
"మంచి వ్యక్తి, గొప్ప నటుడు విక్టరీ వెంకటేశ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 'వెంకీమామ' చిత్రబృందానికి గుడ్‌లక్. లవ్ యూ సర్" - కోన వెంకట్, రచయిత, నిర్మాత
"నాకెంతో ఇష్టమైన, మంచి మనసున్న, నిజాయతీ కలిగిన వ్యక్తి విక్టరీ వెంకటేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. 'వెంకీమామ' చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్" -నితిన్, హీరో
"మన విక్టరీ వెంకటేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. తన ఆలోచనలకు దగ్గరగా ఉండే కథలను మాత్రమే ఆయన ఎప్పుడూ ఎంచుకుంటుంటారు. దీనివల్ల వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన్ని ఒక గొప్ప నటుడిగా అభిమానిస్తుంటారు. 'వెంకీమామ' చిత్రబృందానికి బెస్ట్ విషెస్" - శ్రీను వైట్ల, దర్శకుడు