బాలీవుడ్ తారలు నివసిస్తున్న గృహ సముదాయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అందులో నివసిస్తున్న 11 ఏళ్ల బాలికకు కరోనా సోకడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ సముదాయాల్లో విక్కీ కౌశల్, రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ, చిత్రాంగద సింగ్‌లు ఉంటున్నారు.
ఈ పరిణామంతో అందులో నివసించే ప్రతి ఒక్కరూ విధిగా నిర్బంధాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం వల్ల నటుడు అంకిత్ లోఖండేతో సహా చలనచిత్ర, టెలివిజన్ నటుల భవన సముదాయాలను ఇప్పటికే మూసివేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.