విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్' చిత్రం ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని 'హౌజ్ ద జోష్' సంభాషణ ఎంతో పాపులర్ అయింది. ఇప్పుడీ డైలాగ్‌ను ఓ రెస్టారెంట్లో ఓ వంటకానికి పేరు పెట్టి, మెనూలో ఉంచారు.ఈ విషయాన్ని ఇన్ స్టాలో షేర్ చేశాడు హీరో విక్కీ. 'ఇప్పుడు ఇది వంటకంగా మారింది' అంటూ వ్యాఖ్య జోడించాడు.
పార్లమెంటు సమావేశాల్లో కేంద్రమంత్రులు సైతం ఈ సంభాషణను పలికి సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ డైలాగ్ ఎంతో బాగా రాశారని చిత్రబృందాన్ని ప్రధాని మోదీ కూడా అభినందించారు.