సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు హోటల్ గదుల్లో గడపాలంటే చచ్చేంత భయంగా ఉండేదన్నాడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్. సహజంగానే తాను చిన్నప్పటి నుంచి భయస్థుడునని చెప్పిన విక్కీ... హోటల్ గదుల్లో వెలుతురు, టీవీ సౌండ్ ఉంటేనే నిద్రపోతానని చెప్పాడు. తన నటించిన 'భూత్' ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఈ నటుడు.. చార్మినార్‌ను తొలిసారి చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు.
చార్మినార్ చూసి ఆశ్చర్యపోయిన 'ఉరి' హీరో - విక్కీ కౌశల్ భూత్ సినిమా
'భూత్' సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన హీరో విక్కీ కౌశల్.. చార్మినార్‌ను తొలిసారి చూసి ఆశ్చర్యపోయానన్నాడు. వీటితో పాటే తనకున్న భయం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
హీరో విక్కీ కౌశల్
దీనితో పాటే సమీప హోటల్స్‌లో 5 రకాల టీలను ఆస్వాదించానని చెప్పాడు. బిజీ షెడ్యూల్ వల్ల ఈసారి కుదరలేదని, మరోమారు వచ్చినప్పుడు చార్మినార్ పైకెక్కి నగరం మొత్తం చూస్తానన్నాడు.
హారర్ కథతో తీసిన 'భూత్'.. రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. తీరంలో ఆగిపోయిన ఓ ఓడలో ఎలాంటి సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత ఏమైంది? అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.
Last Updated : Mar 1, 2020, 11:21 PM IST