ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్లాస్టిక్ రహిత ఉద్యమానికి బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో 'ఉరీ' ఫేమ్ విక్కీ కౌశల్ చేరాడు. ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని రక్షించాలని, చిత్ర షూటింగ్ సెట్లలో ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్స్‌ను తాము వాడట్లేదని తెలిపాడు.
"ప్లాస్టిక్‌ను వీలైనంత వరకు తక్కువగా ఉపయోగించాలి. అది మనందరికి ఉపయోగకరం. ఇందువల్ల మన తర్వాతి తరాలకు మంచి చేసిన వాళ్లమవుతాం. ప్రకృతి పట్ల మనం శ్రద్ధ వహించాలి. మా చిత్రాల షూటింగ్ సెట్లలో మీకు ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ దొరకవు. స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నాం. దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా చేసేందుకు మోదీ అద్భుతమైన ముందడుగు వేశారు" -విక్కీ కౌశల్, బాలీవుడ్ హీరో