తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విక్కీ-కత్రినా కైఫ్​ ఎంగేజ్​మెంట్.. నిజమెంత?

బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్​, నటి కత్రినా కైఫ్​ల మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ చాలారోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ త్వరలో ఎంగేజ్​మెంట్ కూడా చేసుకోవడానికి సిద్ధమయ్యారట. ఇరుకుటుంబాలు అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Katrina Kaif
కత్రినా కైఫ్

By

Published : Aug 18, 2021, 5:40 PM IST

యువ నటుడు విక్కీ కౌశల్‌.. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో విలక్షణ కథలతో దూసుకెళ్తున్నాడు. ఇతడు, బాలీవుడ్​ బార్బీ కత్రినా కైఫ్‌ ప్రేమలో ఉన్నట్లు కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ డేటింగ్​లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో సందడి చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన వార్త మరొకటి వైరల్​గా మారింది.

ఇటీవలే విక్కీ-కత్రిన కుటుంబాలు ఎంగేజ్​మెంట్ విషయమై చర్చించుకున్నాయట. రోకా వేడుకను కూడా జరిపాయని తెలుస్తోంది. ఈ సమయంలోనే ఎంగేజ్​మెంట్ ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం. ఈ వార్త విన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వార్తలపై కత్రిన స్నేహితులు క్లారిటీ ఇచ్చారు. ఎంగేజ్​మెంట్ కానీ, రోకా వేడుక కానీ జరగలేదని వారు తెలిపారు. ప్రస్తుతం కత్రిన 'టైగర్ 3' షూటింగ్​లో బిజీగా ఉందని స్పష్టం చేశారు.

​కొంతకాలం క్రితం విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ ప్రేమ వ్యవహారంపై స్పందించాడు నటుడు హర్షవర్ధన్ కపూర్. ఈ జంట ప్రేమలో ఉన్నది నిజమేనని చెప్పాడు​. 'సినీ ఇండస్ట్రీలో నిజమైన రిలేషన్​షిప్​ ఎవరిది?' అని అడిగిన ప్రశ్నకు 'విక్కీ, కత్రిన కలిసున్నారనేది నిజం' అని బదులిచ్చాడు. తక్షణమే 'ఇది చెప్పినందుకు నేనేమైనా ఇబ్బందుల్లో పడతానా?' అని అన్నాడు.

సల్మాన్ ముందే ప్రపోజ్

కత్రినా కైఫ్​కు, సల్మాన్​ ఖాన్​కు మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ అవార్డు ఫంక్షన్​లో సల్మాన్​​ ఎదుటే.. విక్కీ.. కత్రినాకు ప్రపోజ్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఓ అవార్డు ఫంక్షన్​లో విక్కీ హోస్ట్​గా ఉండగా.. కత్రిన అవార్డు ఇచ్చేందుకు వచ్చింది. అప్పుడు విక్కీ.. కత్రినకు ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో సల్మాన్​ ఖాన్​ ప్రేక్షకుల మధ్యలో కూర్చున్నాడు.

ఇవీ చూడండి: నా పిల్లలకు చిల్లిగవ్వ ఇవ్వను.. స్టార్ హీరో సంచలనం

ABOUT THE AUTHOR

...view details