'ఉరి' సినిమాతో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. ప్రస్తుతం ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. గుజరాత్లో అలంగ్ దగ్గర షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అతడి దవడ ఎముక భాగంలో గాయాలయ్యాయి. 13 కుట్లు కూడా వేశారు. మెరుగైన వైద్యం అందించేందుకు ముంబయి తీసుకెళ్లారు.
షూటింగ్లో విక్కీ కౌశల్‌కు గాయాలు - విక్కీ కౌశల్‌కు గాయాలు
ఓ సినిమా షూటింగ్లో విక్కీ కౌశల్‌కు గాయాలయ్యాయి. దవడ ఎముక భాగంలో 13 కుట్లు వేశారు.

షూటింగ్లో విక్కీ కౌశల్‌కు గాయాలు
భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భూమి ఫెడ్నేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ముంబయిలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందీ చిత్రం.
ఇది చదవండి: టర్కీలో షూటింగ్... హీరో విశాల్‌కు గాయాలు