బాలీవుడ్ యువనటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal News).. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో విలక్షణ కథలతో దూసుకెళ్తున్నారు. బాలీవుడ్ బార్బీ కత్రినా కైఫ్‌తో(Vicky Katrina relationship) ఆయన ప్రేమయాణం సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు రూమర్స్ వచ్చినప్పటికీ వాటిని కొట్టిపారేశారు విక్కీ సోదరుడు సన్నీ కౌశల్.
తాజాగా దీనిపై స్పందించిన విక్కీ.. త్వరలోనే తన నిశ్చితార్థం జరుగుతుందని చెప్పారు. అయితే కత్రినాతోనేనా అనేది క్లారిటీ ఇవ్వలేదు! విక్కీ నటించిన కొత్త సినిమా 'సర్దార్ ఉద్ధమ్'. దీని ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన్ను.. 'కత్రినాకైఫ్‌తో మీకు ఎంగేజ్మెంట్ జరుగుతుందని ప్రచారం సాగుతోంది. ఎప్పుడు చేసుకుంటున్నారు?' అని ఓ విలేఖరి అడిగారు. "మీ స్నేహితులే ఈ వార్తను ప్రచారం చేస్తున్నారు(నవ్వుతూ). త్వరలోనే సరైన సమయం చూసి ఎంగేజ్మెంట్ చేసుకుంటాను. ఆ టైమ్ త్వరలోనే వస్తుంది" అని అన్నారు.