కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డేటింగ్లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఇరువురి నటుల అభిమానులు ఈ విషయంపై సానుకూలంగా స్పందించి పలు పోస్టులు పెడుతున్నారు.
యువహీరోతో కత్రినా డేటింగ్.. అభిమానులు ఖుషీ - కత్రినా, విక్కీ డేటింగ్
సినీ తారలు ఏం చేసినా అభిమానులకు పండగే. తాము అభిమానించే నటులు ఎవరితో ఉంటే బాగుంటుందో కూడా వారే నిర్ణయించేస్తారు. ఏవైనా వేడుకల్లో వారు ఒకే వేదికపై కనిపిస్తే ఇక అంతే. ఇటీవల బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డేటింగ్ చేస్తున్నారని వస్తున్న వార్తలపై అభిమానులు అమితాసక్తి కనబరుస్తున్నారు.
విక్కీ, కత్రినా జంట బాగుంటుంది: ఫ్యాన్స్
ఇటీవల కత్రినా, విక్కీ ఓ స్నేహితుడు ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్నారు. కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి పార్టీలకు హాజరవుతున్నారు. ఇటీవల నిర్మాత అలీ అబ్బాస్ జాఫర్ పుట్టినరోజు వేడుకలోనూ కలిసి పాల్గొన్నారు. ఈ కారణంగా వీరిద్దరిపై వస్తున్న వదంతులను అభిమానులు కూడా ఇష్టపడుతున్నారు. ఈ జంటకు అనుకూలంగా పలు సందేశాలు పంపిస్తున్నారు. కొంతమంది అభిమానులైతే విక్కీ చాలా అదృష్టవంతుడు అని పోస్ట్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ట్రైలర్: ఫన్, ఎమోషనల్ 'సవారి'
Last Updated : Feb 18, 2020, 2:21 AM IST