తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రామారావు.. నాగేశ్వరరావు.. తర్వాత చిరంజీవి' - chiranjeevi movies

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తను నటించిన 'సైరా' సినిమా చూపించాడు మెగాస్టార్ చిరంజీవి. అనంతరం మాట్లాడిన వెంకయ్య.. చిత్రం బాగుందని మెచ్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి-ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

By

Published : Oct 16, 2019, 6:56 PM IST

Updated : Oct 16, 2019, 8:50 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'సైరా'.. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే బుధవారం దిల్లీ వెళ్లిన చిరు.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఈ చిత్రాన్ని చూపించాడు. అనంతరం మాట్లాడిన వెంకయ్య.. ఈ నటుడిపై ప్రశంసలు కురిపించారు. జానపద చిత్రాల్లో నటించడంలో ఎన్​.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత చిరంజీవి అని అన్నారు.

మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

'సైరా'ను స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో రూపొందించారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతమందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. హీరో రామ్​చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు.

ఇది చదవండి: 'సైరా'కు సన్మానం.. మెగాస్టార్​పై ప్రశంసలు

Last Updated : Oct 16, 2019, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details