తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్రీకారం.. యువత చూడాల్సిన చక్కని సినిమా'

శర్వానంద్​ ప్రధాన పాత్రలో వచ్చిన 'శ్రీకారం' సినిమాను ప్రశంసించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ చిత్రం యువత చూడదగిన చక్కని సినిమా అని కితాబిచ్చారు.

venkiayah
వెంకయ్యనాయుడు

By

Published : Mar 22, 2021, 8:50 PM IST

శర్వానంద్​ హీరోగా ఇటీవల విడుదలైన 'శ్రీకారం' సినిమా పాజిటివ్​ టాక్​ తెచ్చుకుని పలువురు ప్రశంసలను అందుకుంది. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఈ సినిమాను, చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. యువత ఈ సినిమాను చూడాలని పిలుపునిచ్చారు.

"అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో, ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్లవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం." అని వెంకయ్యనాయుడు అన్నారు.

ఈ చిత్రాన్ని కిశోర్‌ తెరకెక్కించారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. రైతు పాత్రలో శర్వానంద్‌ ఆకట్టుకున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదలై అభిమానులను అలరిస్తోంది.

ఇదీ చూడండి:'శ్రీకారం' కథ అలా పుట్టింది: చిత్ర దర్శకుడు

ABOUT THE AUTHOR

...view details