ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం చలనచిత్ర రంగంలో ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న చిత్రాలతోపాటు, నటీనటులు జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను నేడు ప్రదానం చేశారు. ముఖ్య అతిథి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా పలువురు సినీ తారలు అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ చిత్రంగా గుజరాత్ ఫిల్మ్ 'హెల్లారో' నిలవగా, 'ఉరి' చిత్రంలో నటించిన విక్కీ కౌశల్, 'అంధాధున్'లో నటించిన ఆయుష్మాన్ ఖురానా సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 'మహానటి'లో సావిత్రి పాత్రకుగానూ కీర్తి సురేశ్ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హాజరయ్యాడు. ఇతడికి 'ప్యాడ్‌మ్యాన్' చిత్రానికి గానూ ఉత్తమ సామాజిక కథాంశం విభాగంలో అవార్డు దక్కింది.
మొత్తం 31 కేటగిరీలు, 23 నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీల్లో అవార్డులను అందజేసింది ప్రభుత్వం.
అవార్డులు...
జాతీయ ఉత్తమ చిత్రం - హెల్లారో (గుజరాతీ)
జాతీయ ఉత్తమ నటుడు- ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్), విక్కీ కౌశల్(ఉరి)
జాతీయ ఉత్తమ నటి - కీర్తి సురేశ్ (మహానటి)
ఉత్తమ తెలుగు చలనచిత్రం - మహానటి
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - మహానటి
ఉత్తమ ఆడియోగ్రఫీ - రంగస్థలం (రాజాకృష్ణన్)
ఉత్తమ స్క్రీన్ ప్లే - చి.ల.సౌ (తెలుగు)
ఉత్తమ హిందీ చలనచిత్రం - అంధాధున్
ఉత్తమ సినిమాటోగ్రఫీ - పద్మావత్
ఉత్తమ సంగీత దర్శకుడు -సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)
ఉత్తమ యాక్షన్ చలనచిత్రం - కేజీఎఫ్
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ - ఉరి
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: అ! (తెలుగు), కేజీఎఫ్(కన్నడ)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ మేకప్: అ!
ఉత్తమ ఎడిటింగ్: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ సౌండ్ డిజైనింగ్: ఉరి
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీప్‌ప్లే: అంధాధున్
ఉత్తమ సంభాషణలు: తారీఖ్(బంగాలీ)
ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్(పద్మావత్: బింటే దిల్)
ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్, షాహిబ్ సింగ్, తలాహ్ అర్షద్ రేసి, శ్రీనివాస్ పోకాలే
బిగ్‌బీ గైర్హాజరు...
2018గానూ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ప్రకటించింది ప్రభుత్వం. నేడు ఆ పురస్కారం తీసుకోవాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు బిగ్‌బీ.